Galijeru Health Benefits:ఈ ఆకుకూర ఎక్కడ కనిపించిన వదలకండి ..కిడ్నీ నుంచి కీళ్ల వరకు పవర్

';

కిడ్నీల్లో రాళ్లు

ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పుల నుంచి లివర్ ప్రాబ్లమ్స్ వరకు, జీర్ణ సమస్యల నుంచి ఎముకల బలహీనత వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

';

గలిజేరు

ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టాలంటే చేను చెలకల్లో, బీడు భూముల్లో లభించే గలిజేరు ఆకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

';

తెల్ల గలిజేరు

ఈ గలిజేరును, పునర్నవ, అటికమామిడి, పప్పాకు అని కూడా పిలుస్తారు. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకు కూర తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.

';

కిడ్నీ సమస్యలకు

కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ ఆకులను డైట్లో చేర్చుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్ సి, ఇతర పోషకాలు మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తాయి.

';

లివర్ ఆరోగ్యానికి

ఈ ఆకు కూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇతర మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తింటే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు

';

జీర్ణక్రియకు

ఈ ఆకు కూరలో పుష్కలంగా ఉండే పోషకాలు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీన్ని తీసుకుంటే మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

';

ఎముకలకు బలం

గలిజేరు ఆకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆర్థరైటిస్, కీళ్లనొప్పులు, వాపు లక్షణాలు తగ్గుతాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు జరుగుతుంది.

';

ఎలా తినాలి.

పోషకాలు పుష్కలంగా ఉండే గలిజేరు ఆకులను కర్రీలా వండుకోవచ్చు. పప్పులో వేసుకుని తినవచ్చు. కషాయం కూడా చేసుకోవచ్చు.

';

Disclaimer

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story