ఆరోగ్యానికి ఎంతో మంచిదైన క్యారెట్ తో వడ చేసుకోవడం కోసం.. ముందుగా ఒక కప్పు శనగపప్పుని.. బాగా కడిగి మూడు గంటలసేపు నానబెట్టుకోండి.
ఇప్పుడు శనగపప్పులోని నీరు అన్ని కిందకు వంచేసి.. కొద్దిగా సెనగపప్పుని పక్కన పెట్టుకొని మిగతా పప్పు మొత్తం మిక్సీలో వేసి బరకగా రుద్దుకోండి.
పప్పుతో పాటు కొద్దిగా అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, 3 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో.. మూడు చెంచాల బియ్యప్పిండి.. వేసుకోవాలి.
అందులోనే ఒక కప్పు క్యారెట్ తురుము, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు తురుము, పక్కకు తీసి పెట్టుకున్న శనగపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని..చిన్న చిన్న ఉండలు చేసి వడల్లాగా బాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని నూనె పోసుకుని బాగా వేడెక్కాక ఈ వడల్ని అందులో వేసుకోవాలి.
కాస్త రంగు మారే వరకు వేయించి తీసుకుంటే క్యారెట్ వడలు తయార్.