గోధుమల పాయసం తయారీ చేసుకోవడం కోసం.. ముందుగా మూడు కప్పుల గోదుమలను నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత వాటిని కచ్చాపచ్చాగ మిక్సీలో వేసి పట్టుకోవాలి. మళ్లీ ఈ గోధుమలను కాసేపు నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత కుక్కర్లో 5 నుంచి 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
మరోపక్క కొన్ని గసగసాలు వేయించుకొని.. చల్లారిపోయాక మిక్సీలో గసగసాలు, 1 కప్పు బియ్యం పిండి, యాలకులు వేసుకొని రుబ్బుకోవాలి.
ఈ పిండిలో.. ఒక కప్పు.. బియ్యం పిండి, నీళ్లు పోసుకుంటూ దోశపిండి లాగా కలుపుకోవాలి. కరిగాక.
కడాయిలో మూడు కప్పుల బెల్లం మునిగేనన్ని నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి. అందులోని ఉడికించుకున్న గోదుమలు, నెయ్యి వేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి.
ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న.. పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా కలుపుతూ ఉండల్లేకుండా కలుపుకోవాలి.
ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత.. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని.. ఉడుకుతున్న పాయసంలో వేసుకుని కలపాలి. అంటే ఎంతో రుచికరమైన గోధుమ పాయసం రెడీ.