దేశంలో అత్యధిక మందికి బెడ్ టీ అలవాటు ఉంటుంది. కానీ ఈ సమస్యలతో బాధపడేవారు బెడ్ టీ తీసుకోకూడదు. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది
ప్రతి భారతీయుడికి టీ అంటే చాలా ఇష్టముంటుంది. చాలామంది తమ దినచర్యను టీతోనే ప్రారంభిస్తుంటారు.
కానీ ఉదయమే టీ తాగడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
రోజూ పరగడుపున టీ తాగే అలవాటుంటే మీకు వాంతులు, వికారం, ఆందోళన వంటి సమస్యలు ఎదురుకావచ్చు.
ఉదయం పరగడుపున టీ తాగడం వల్ల పిత్తరసం ఉత్పత్తి ప్రక్రియలో అంతరాయం కలుగుతుంది. దాంతో కంగారు, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు.
పరగడుపున టీ తాగుతుంటే అల్సర్ సమస్య ఉత్పన్నం కావచ్చు. బెడ్ టీ అనేది హైపర్ ఎసిడిటీకు కారణమౌతుంది
రోజూ పరగడుపున టీ తాగితే కడుపు ఉబ్బరంగా ఉండే సమస్య ఉత్పన్నం కావచ్చు.
పరగడుపున టీ తాగడం వల్ల అలసట ఉంటుంది. దాంతో మూడ్ స్వింగ్ ఉంటుంది.
రోజూ అదే పనిగా పరగడుపున టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థలో సమస్య రావచ్చు. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు ఎదురౌతాయి