Dates Benefits

బరువు తగ్గేందుకు రోజుకు ఒక్కటంటే ఒక్కటీ ఖర్జూర చాలు

Ravi Kumar Sargam
Dec 04,2024
';

తక్కువ తినడం

ఖర్జూరాలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఫిట్‌నెస్ చేసేవారికి ఖర్జూర వరమని చెప్పాలి. ఆకలి వేయడాన్ని తగ్గిస్తుంది. అతిగా తినడాన్ని నిరోధించడంలో ఖర్జూర సహాయ పడుతుంది.

';

ఫైబర్ అధికం

ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వాటిలో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఎక్కువసేపు తిన్నారనే అనుభూతిని కలిగిస్తుంది. దీంతో తక్కువ ఆహారం తింటారు.

';

జీర్ణక్రియ

అధికంగా ఫైబర్ ఉండే ఖర్జూర తింటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. మలబద్ధకాన్ని నివారించడంలో ఖర్జూర దోహదం చేస్తుంది.

';

మంచి కొవ్వులు

యాంటీఆక్సిడెంట్లకు ఖర్జూర మంచి పండుగ చెప్పవచ్చు. ఈ పండు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

';

ఉపశమనం

తీపి ఆహారాల కోసం కోరికలను తగ్గించడానికి ఖర్జూర చక్కటి పండు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో నియంత్రణ వస్తుంది. రోజంతా చురుకుగా ఉండటానికి.. నిరంతర శక్తిని అందించేందుకు ఖర్జూర దోహదం చేస్తుంది. ఖర్జూర తింటే అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది.

';

విలువైన పోషకాలు

ఖర్జూరంలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. 100 గ్రాముల ఖర్జూరంలో 696 మిల్లీ గ్రాముల పొటాషియం, 54 మిల్లీ గ్రాముల మెగ్నీషియం, 0.9 మిల్లీ గ్రాముల ఇనుము ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవి.

';

రక్తపోటు

రక్తపోటును నియంత్రించడానికి పొటాషియం అవసరం. మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరుకు ఉపయోగపడుతుంది. అవన్నీ ఖర్జూరలో అధికంగా ఉంటాయి.

';

గమనిక:

ఇది కేవలం అవగాహన కల్పించడం కోసం అందించిన సమాచారం. దీనిని జీ తెలుగు ధ్రువీకరించడం లేదు.

';

VIEW ALL

Read Next Story