బీపీ నియంత్రణ కోసం కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం ద్వారా, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ వెబ్‌స్టోరీలో, బీపీని క్రమబద్ధం చేసేందుకు ఉపయోగపడే ఐదు ముఖ్యమైన చిట్కాలను తెలుసుకుందాం.
బీపీ నియంత్రణలో డైట్ చాలా ముఖ్యం. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తక్కువ సోడియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా..బీపీని తగ్గించుకోవచ్చు.
నిరంతర వ్యాయామం మీ బ్లడ్ ప్రెషర్‌ను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు నడక, యోగా వంటి వ్యాయామాలు చేయడం మంచిది.
ఆపిల్ సిడర్ వెనిగర్ వంటి సహజ పదార్థాలు బీపీ కంట్రోల్ చేసేందుకు సహాయపడతాయి. ప్రతి రోజు ఉదయం ఒక స్పూన్ ఆపిల్ సిడర్ వెనిగర్.. నీటిలో కలిపి తాగడం బీపీ తగ్గించడంలో ఉపకరిస్తుంది.
నిరంతరం ఉత్కంఠను తగ్గించుకోవడం కూడా బీపీ నియంత్రణకు అవసరం. ధ్యానం, ప్రాణాయామం వంటి టెక్నిక్స్ మనసుకు ప్రశాంతత కలిగించి బీపీని తగ్గిస్తాయి.
గురక తగ్గించుకోవడం, బాగా నిద్రపోవడం ద్వారా బీపీ కంట్రోల్ చేయవచ్చు. నిద్రపోవడంలో ఏవైనా సమస్య ఉంటే, ఆ సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు..వైద్య నిపుణుల సలహాల వరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.