పెరుగు తినడం జీర్ణక్రియను.. మెరుగుపరుస్తుంది. రాత్రిపూట పెరుగు తీసుకోవడం తేలికపాటి జీర్ణానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి పెరుగు చాలా సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్ అధికంగా.. ఉండడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది.
చర్మానికి నిగారింపు తీసుకొస్తుంది. పెరుగు తినడం వల్ల చర్మం డ్రై అవ్వకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగు ప్రొబయాటిక్స్ వల్ల శరీరానికి అవసరమైన బ్యాక్టీరియాల ప్రభావం మెరుగుపడుతుంది.
మెరుగైన నిద్రకు సహాయపడుతుంది. పెరుగులోని మెగ్నీషియం.. ఇతర పోషకాలు శరీరాన్ని సేదతీరుస్తాయి.
జలుబు ఉంటే పెరుగును తగ్గించాలి. రాత్రిపూట ఎక్కువగా తీసుకుంటే తేమ శరీరంలో పెరిగే అవకాశం ఉంది. జలుబు లేని వాళ్ళు మాత్రం రోజు రాత్రి అన్నం బదులు పెరుగు.. ఇక అందులో ఏదన్న కూరగాయలు వేసుకుని తింటే ఎంతో మంచిది.
పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగులో ఉండే ప్రొబయాటిక్స్ శరీరానికి అవసరమైన విటమిన్స్ ని అందిస్తాయి.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.