కొన్ని రకాల మొక్కలు లేదా చెట్లు పాములకు అలవాలంగా మారతాయి. అందుకే పొరపాటున కూడా ఇంట్లో ఈ మొక్కల్లేకుండా చూసుకోండి
మొక్కలు పెంచుకోవాలని. ఇంటి ఆవరణ పచ్చగా ఉండాలని చాలామందికి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని ప్రమాదాలు ఎదురు కావచ్చు
పుదీనా మొక్కల్ని కుండీల్లోకాకుండా నేలలో పాతితే ఎలుకలు కలుగు తీసి నివాసముంటాయి. అందులో పాములు వచ్చి చేరతాయి
మొక్కలు చెట్లు ఇంటి ఆవరణలో ఉండటం మంచిదే కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇంట్లోకి ప్రమాదకర పాములు చొరబడిపోతాయి.
కొన్ని రకాల మొక్కలు పాముల్ని ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఆ మొక్కలేంటో తెలుసుకుందాం.
సైప్రస్ అనేది ఓ అలంకరణ మొక్క. దట్టంగా పెరుగుతుంది. అందుకే ఈ మొక్కతో జాగ్రత్తగా ఉండాలి. పాములు చాలా సులభంగా ఇందులో దాక్కోగలవు. చిన్న చిన్న కీటకాల కోసం ఈ మొక్కలపై ఉంటాయి
దానిమ్మ చెట్టు వద్ద పాములు కచ్చితంగా ఉంటాయి. అందుకే ఇంటి ఆవరణలో పొరపాటున కూడా ఈ చెట్టు లేకుండా చూసుకోండి
లవంగం మొక్కలు కూడా చూడ్డానికి దట్టంగా ఉంటాయి. నేల భాగాన్ని పూర్తిగా కవర్ చేసేస్తాయి. పాములు ఇందులో దాక్కుంటే పసిగట్టడం కష్టమే
అందుకే ఈ మొక్క ఆకుల కింద పాములు చాలా సులభంగా దాక్కుంటాయి.
సిట్రస్ ఫ్రూట్స్ చెట్లపై పాములు కచ్చితంగా ఉంటాయంటారు. అందుకే ఇంటి ఆవరణలో ఈ మొక్కలుండకూడదు
మల్లెపూల మొక్కలున్నచోట పాములుండేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. వీటి సువాసన పాముల్ని ఇట్టే ఆకర్షిస్తుంది