భారతదేశంలో రాబోయే టాప్ 10 హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు ఇవే..
దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మౌళిక సదుపాయాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న రాబోయే 10 హై స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు ఎలా ఉండబోతున్నాయో AI చిత్రాల ఆధారంగా చూద్దాం..
1,386 కిలో మీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్ వే ఢిల్లీ నుండి ముంబైని కలుపుతూ, 5 రాష్ట్రాల గుండా వెళుతుంది. ఇది ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ప్రయాణ సమయం 12 గంటలకు పైగా తగ్గుతుంది.
262 కి.మీ పొడవైన ఎక్స్‌ప్రెస్ వే బెంగళూరు నుండి చెన్నైని కలుపుతూ నిర్మిస్తున్నారు. ఇది 3 రాష్ట్రాల గుండా వెళుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ప్రయాణ సమయం రెండున్నర గంటలకు తగ్గుతుంది.
610 కి.మీ పొడవైన ఎక్స్‌ప్రెస్ వే వారణాసిని కోల్‌కతాను కలుపుతూ, 4 రాష్ట్రాల గుండా సాగుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ప్రయాణ సమయం 9 గంటలకు తగ్గుతుంది.
ఢిల్లీ నుండి డెహ్రాడూన్‌ను కలుపుతూ 210 కి.మీ పొడవైన ఎక్స్‌ప్రెస్ వే. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం రెండున్నర గంటలకు కుదిస్తుంది.
1,271 కి.మీ పొడవైన ఎక్స్‌ప్రెస్ వే సూరత్ నుండి చెన్నైకి 6 రాష్ట్రాల గుండా వెళుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ప్రయాణ సమయం కేవలం 18 గంటలకు తగ్గుతుంది.
670 కి.మీ పొడవైన రహదారి ఢిల్లీ నుండి కత్రాకు 3 రాష్ట్రాల గుండా వెళుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 6 గంటలకు తగ్గిస్తుంది.
ఇండోర్‌ను హైదరాబాద్‌ను కలుపుతూ 713 కి.మీ పొడవైన ఎక్స్‌ప్రెస్ వే. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 8 గంటలకు తగ్గుతుంది.
కాన్పూర్ నుండి లక్నోను కలుపుతూ 63 కి.మీ పొడవైన ఎక్స్‌ప్రెస్ వే. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ప్రయాణ సమయం కేవలం 1 గంటకు తగ్గుతుంది.
పంజాబ్ లోని అమృత్‌సర్‌ను గుజరాత్ లోని జామ్‌నగర్‌ను కలిపే 1,257 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్ వే. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 13 గంటలకు తగ్గిస్తుంది.
ముంబై నుండి నాగ్‌పూర్‌ని కలుపుతూ 800 కి.మీ పొడవైన ఎక్స్‌ప్రెస్ వే. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 8 గంటలకు తగ్గిస్తుంది.