ఇంట్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం సమయంలో కూడా ఎండ విపరీతంగా ఉంటుంది. దీంతో ఏసీ నిరంతరం ఉపయోగించాల్సి ఉంటుంది.
ఏసీ ఎక్కువసేపు వినియోగించిన బిల్లు ఎక్కువ రాకుడదంటే కొన్ని ట్రిక్స్ తెలుసుకోండి.
సాధారణంగా ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీలకు సెట్ చేసుకుంటే రూం కూల్ అవుతుంది. బిల్లు ఎక్కువగా రాదు.
ఏసీ ఉష్ణోగ్రత తగ్గించే ప్రతి డిగ్రీకి 6 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతుంది.
ఏసీ యూనిట్ బయట ఉంటుంది కాబట్టి దాన్ని తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. దీంతో దానిపై విద్యుత్ భారం పడదు.
కనీసం ఏడాదికి ఒకసారైనా ఎండకాలం ప్రారంభంలో ఏసీ సర్వీసింగ్ చేయించండి.
ముఖ్యంగా ఏసీలు ఆన్ చేసే ముందే కిటికీలు, తలుపులు మూసి ఉంచండి.
ఏసీ రిమోట్లో టైమర్ సెట్ చేసుకుంటే గది ఉష్ణోగ్రత చల్లబడిన వెంటనే ఆటోమెటిగ్గా ఆఫ్ అవుతుంది. దీంతో కరెంటు బిల్లు తగ్గుతుంది.