బూడిద గుమ్మడికాయ అనేది ఆయుర్వేదంలో అత్యంత ఔషధ విలువలు కలిగిన కాయగా పేర్కొంటారు. దీన్ని కుశ్మాండం అని కూడా పిలుస్తారు. దీని జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం
బూడిద గుమ్మడికాయ జ్యూసులో ఒమేగా 3 యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి ఇది గుండెకు సంబంధించిన జబ్బులను రాకుండా నిరోధిస్తాయి.
బూడిద గుమ్మడికాయలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఈ జ్యూస్ తాగినట్లయితే కిడ్నీలోని రాళ్ళను సైతం కరిగించవచ్చు
బూడిద గుమ్మడికాయ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ను కాపాడుతాయి ఇవి లివర్ను టాక్సిన్ ల నుంచి కాపాడి డీటాక్సిఫికేషన్ చేస్తుంది
బూడిద గుమ్మడికాయలో పాలీ ఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.
బూడిద గుమ్మడికాయలో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి భూమిడితో గుమ్మడికాయ జ్యూస్ ప్రతిరోజు తాగినట్లయితే మీ చర్మం ముడతలు పడకుండా ఉంటుంది తద్వారా మీరు నిత్య యవ్వనం తో ఉంటారు.
బూడిద గుమ్మడికాయ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తుంది ఇది మార్కెట్లలో కూడా కొనుగోలు చేయవచ్చు.
బూడిద గుమ్మడికాయను చెక్కు తీసుకొని గింజలను వేరు చేసి ఆ తర్వాత ముక్కలను సన్నగా కట్ చేసి జ్యూస్ మిక్సీలో వేసి జ్యూస్ చేసుకుని తాగవచ్చు.
బూడిద గుమ్మడికాయ జ్యూస్ లో ఏమీ కలపాల్సిన అవసరం లేదు ఇది చాలా రుచికరంగా ఉంటుంది.
మన శరీరంలో ఉష్ణాన్ని తొలగించడంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది