ఇది రోజు తాగితే.. ప్రోటీన్ లోపమే ఉండదు.. పొట్ట కూడా ఫ్లాట్!
Dharmaraju Dhurishetty
Jan 01,2025
';
అవోకాడో, అరటి పండు స్మూతీ రోజు తాగడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.
';
ముఖ్యంగా ఈ స్మూతీలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి.
';
రోజు ఈ స్మూతీ తాగడం వల్ల శరీర శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది.
';
అలాగే ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
';
అంతేకాకుండా ఈ స్మూతీలో ఉండే మూలకాలు కొవ్వును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి.
';
అవోకాడో, అరటి పండు స్మూతీ కావలసిన పదార్థాలు, తయారీ విధానం పూర్తి వివరాలు.
';
కావాల్సిన పదార్థాలు: 1 పండిన అరటి పండు, 1/2 అవోకాడో, 1 కప్పు పాలు (బాదం పాలు లేదా సోయా పాలు), 1-2 టేబుల్ స్పూన్లు తేనె, కొద్దిగా వనిల్లా ఎసెన్స్, కొద్దిగా ఐస్ ముక్కలు
';
ముందుగా ఈ స్మూతీని తయారు చేసుకోవడానికి అరటి పండును తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత అవోకాడోను రెండుగా కోసి అందులోని గుజ్జును తీసుకుని బౌల్‌లో వేసుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా చేసిన తర్వాత ఈ రెండింటిని బ్లెండర్ జార్‌లో వేసుకుని మిక్సీ కొట్టుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత అందులో బాదం పాలు, తేనె, కొద్దిగా వనిల్లా ఎసెన్స్ వేసుకుని మరోసారి మిక్సీ కొట్టుకోండి.. అంతే స్మూతీ రెడీ అయినట్లే..