రుతు పవనాల సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాలి. తరచూ వ్యాధులు సోకే అవకాశం ఉంది.
వర్షాకాలంలో ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు కురిసే సమయంలో ఈ ఐదు ఆహారాలకు దూరంగా ఉండడం మేలు
వర్షాకాలంలో తేమ మరియు తేమతో కూడిన పరిస్థితులు ఉంటాయి. వర్షాల సమయంలో ఆకుకూరలపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో పాలకూర, క్యాబేజీని దూరం ఉంచండి.
వర్షాకాలంలో పచ్చిగా ఆహారం తీసుకోవద్దు. ఈ సమయంలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు తీవ్రంగా వ్యాపిస్తుంటాయి. వండిన ఆహారం మాత్రమే తీసుకోండి.
వర్షాకాలమే కాదు ఏ కాలమైనా ఘాటు పదార్థాలు పొందడం ఆరోగ్యానికి చేటు. మసాలా పదార్థాలు జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఎసిడిటీ, అజీర్ణానికి దారి తీస్తుండడంతో మసాలా పదార్థాలకు దూరమవ్వండి.
చల్లటి శక్తిని పెరుగు కలిగి ఉంటుంది. వర్షాకాలంలో పెరుగు అజీర్ణం, రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. జలుబు, దగ్గుకు దారి తీస్తుండడంతో పెరుగును తినవద్దు.
వర్షాకాలం నీరు కలుషితమవుతుంది. నీటి వనరుల్లోకి వరద రావడంతో ఈ సమయంలో సముద్రపు ఉత్పత్తులు తినడం మానేయాలి. రొయ్యలు, చేపలు వంటివి తినవద్దు.