అద్భుతమైన పోషకాలు కలిగిన బీట్రూట్ దోస రెసిపీ.. ఇలా ఐదు నిమిషాల్లో తయారు చేసుకోండి..

';

బీట్రూట్లో శరీరానికి కావలసిన ఐరన్, క్యాల్షియం అధిక మోతాదులో లభిస్తుంది. ప్రతిరోజు దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

బీట్రూట్ ని ఐరన్ లోపం సమస్యతో బాధపడుతున్న వారు రక్తహీనత సమస్యలు ఉన్నవారు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

';

బీట్రూట్ తినని వారు దీనిని దోసలా తయారు చేసి కూడా తినొచ్చు. అయితే ఈ బీట్రూట్ దోస తయారీ విధానం ఇప్పుడే తెలుసుకోండి.

';

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్ ముక్కలు - 2 కప్పులు, బియ్యప్పిండి - 1 కప్పు, మినప పిండి - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ (సన్నగా తరిగినది) - 1/2

';

కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి (సన్నగా తరిగినది)- 2, కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - 1/4 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా

';

తయారీ విధానం: ఒక గిన్నెలో బీట్‌రూట్ ముక్కలు, జీలకర్ర, తగినంత నీళ్ళు వేసి మెత్తగా ఉడికించాలి.

';

ఉడికించిన బీట్‌రూట్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.

';

ఒక గిన్నెలో రుబ్బిన బీట్‌రూట్, బియ్యప్పిండి, మినప పిండి, ఉప్పు కలిపి దోస బ్యాటర్ గా కలుపుకోవాల్సి ఉంటుంది.

';

స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసి, గరిటెతో పిండిని తీసుకొని దోశలాగా పోసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా పోసుకున్న దోస బాగా కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని కొంచెం కొంచెం నెయ్యి లేదా నూనెను వేస్తూ బాగా కాల్చుకోవాలి. అంతే రెడీ అయినట్లే..

';

ప్రతిరోజు ఉదయం పూట పిల్లలకు అల్పాహారంగా బీట్రూట్ దోస ఇవ్వడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

VIEW ALL

Read Next Story