Natural Hair Die: తెల్ల జుట్టును నల్లగా మార్చే పదార్ధం, హెయిర్ డై కూడా ఎందుకూ పనిచేయదు

user Md. Abdul Rehaman
user Oct 02,2024


ఇటీవల వైట్ హెయిర్ సమస్య చాలా ఎక్కువగా ఉంటోంది. చాలామందికి ఇప్పుడు అదే ప్రధాన సమస్య


తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. హెయిర్ డై, హెయిర్ కలర్ వాడుతుంటారు


అయితే వీటిలో ఉండే రసాయనాల కారణంగా జుట్టు మరింతగా పాడవుతుంది. హెయిర్ ఫాల్ సమస్య పెరుగుతుంది


అయితే నేచురల్ హోమ్ రెమిడీస్ పాటిస్తే జుట్టును నల్లబర్చుకోవచ్చు. నేచురల్ హెయిర్ డై తయారు చేసుకోవచ్చు


నేచురల్ హెయిర్ డై తయారు చేసేందుకు పెరుగు, ఉల్లిపాయలు, మెంతులు, కొబ్బరి నూనె, బీట్‌రూట్ అవసరమౌతాయి.


ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. హెయిర్ ప్యాక్ మిశమంగా మారుతుంది. అందులో కొబ్బరి నూనె కలుపుకోవాలి.


ఈ మిశ్రమాన్ని మీ కేశాలకు కుదుళ్లకు సైతం పట్టేలా రాసుకుని ఓ అరగంట ఉంచాలి.


ఈ మిశ్రమం వల్ల మీ కేశాలు సహజసిద్ధంగా నల్లగా మారడమే కాకుండా కేశాల్ని పటిష్టం చేస్తాయి.

VIEW ALL

Read Next Story