ఈ రెసిపీతో మీ పొట్ట, కొలెస్ట్రాల్ పూర్తిగా మాయం..
Dharmaraju Dhurishetty
Jan 01,2025
';
లో కార్బోహైడ్రేట్స్‌తో కూడిన ఆహారాల్లో జెన్ అవకాడో టోస్ట్ రెసిపీ ఒకటి..
';
భారతదేశ ప్రజలతో పోలిస్తే.. జెన్ అవకాడో టోస్ట్ రెసిపీని ఇతర దేశప్రజలు ఎక్కువగా తింటూ ఉంటారు.
';
జెన్ అవకాడో టోస్ట్ రోజు అల్పాహారంలో భాగంగా తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఇది బరువుతో పాట కొవ్వును తగ్గిస్తుంది.
';
మీరుకు మీ డైట్‌లో జెన్ అవకాడో టోస్ట్ రెసిపీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా ట్రై చేయండి.
';
జెన్ అవకాడో టోస్ట్ రెసిపీకి కావలసిన పదార్థాలు: 2 ముక్కల బ్రౌన్ బ్రెడ్, 1 పండు అవకాడో, 1/2 నిమ్మకాయ రసం, 1 పచ్చిమిరపకాయ (చిన్న చిన్న ముక్కలుగా కోసిన)
';
కావలసిన పదార్థాలు: కొత్తిమీర ఆకులు (చెక్కలు చేసిన), ఉప్పు రుచికి తగినంత, ఉల్లిపాయ (చిన్న చిన్న ముక్కలుగా కోసిన)
';
కావలసిన పదార్థాలు: చెర్రీ టమాటాలు (చిన్న చిన్న ముక్కలుగా కోసిన), డ్రై ఒరెగానో, ఆలివ్ ఆయిల్, బటర్, ఎవరీథింగ్ బేగెల్ సీజనింగ్ (గార్నిషింగ్ కోసం)
';
తయారీ విధానం: ముందుగా ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఎలాంటి మైదా లేని బ్రౌన్ బ్రెడ్‌ను రెండు ముక్కలు తీసుకు.. దానికి బట్టర్ అప్లై చేసుకోండి.
';
ఇలా బట్టర్ అప్లే చేసుకున్న తర్వాత రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు టోస్టర్ మెషిన్‌లో టోస్ట్ చేసుకోండి.
';
ఆ తర్వాత అవకాడోను తీసుకుని అందులో నుంచి గుజ్జు తీసుకుని.. ఓ బౌల్‌లో మొత్తగా మ్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఆ అవకాడోలో బౌల్‌లోనే నిమ్మకాయ రసం, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి వాటి ఓ మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
';
అలాగే మరో బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, చెర్రీ టమాటా ముక్కలు, డ్రై ఒరెగానో, ఆలివ్ ఆయిల్, ఉప్పు అన్నింటినీ వేసుకుని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత అవకాడో మిశ్రమాన్ని బ్రెడ్ ముక్కలపై పెట్టి.. దానిపై ఉల్లిపాయల మిశ్రమం వేసుకుని మరో బ్రెడ్ ముక్క పెట్టుకుని తినండి.