షుగర్‌ను కంట్రోల్ చేసే అద్భుతమైన కర్రీ.. రుచి కూడా వేరే లెవెల్!

Dharmaraju Dhurishetty
Oct 06,2024
';

మధుమేహం ఉన్నవారికి ఎంతో సహాయపడే కూరగాయల్లో క్యాప్సికం ఒకటి.

';

క్యాప్సికం ను సలాడ్స్ లేదా కర్రీ లా తయారుచేసి తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా క్యాప్సికంలో ఉండే కొన్ని గుణాలు శరీర బరువును కూడా నియంత్రించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి.

';

అలాగే క్యాప్సికం శరీరంలోని షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుందని ఇటీవల కొన్ని అధ్యయనాల్లో తేలింది.

';

కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా క్యాప్సికం తో తయారు చేసిన కర్రీలను తీసుకోవడం ఎంతో మంచిది.

';

మధుమేహంతో బాధపడేవారు ఈ క్యాప్సికం రెసిపీని తప్పకుండా ట్రై చేయండి..

';

క్యాప్సికం కర్రీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తెలుసుకోండి..

';

కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం - 250 గ్రాములు (మీకు కావాల్సిన రంగులోని క్యాప్సికం తీసుకోవచ్చు), ఉల్లిపాయ - 1 (పెద్దది), టమోటాలు - 2 (పెద్దవి)

';

కావలసిన పదార్థాలు: పసుపు - 1/2 టీస్పూన్, కారం పొడి - 1 టీస్పూన్ (మీకు రుచి తగ్గట్టుగా), కొత్తిమీర - కట్ చేసి, నూనె - 2 టేబుల్ స్పూన్లు

';

కావలసిన పదార్థాలు: గరం మసాలా - 1/4 టీస్పూన్, కసూరి మేతి - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి తగ్గట్టుగా, కొద్దిగా నీరు

';

తయారీ విధానం: ముందుగా ఈ కర్రీ ని తయారు చేయడానికి క్యాప్సికం, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

';

ఆ తర్వాత స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకుని ముందుగా ఉల్లిపాయలను వేసుకొని గోధుమ రంగులోకి వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వండి.

';

అన్ని వేగిన తర్వాత పసుపు, మెంతుల పొడి వేసి మరి కాస్త మగ్గనివ్వాలి.. ఆ తర్వాత అందులో క్యాప్సికం వేసి కొద్దిసేపు వేడి మీద అటు ఇటు కలుపుకోండి.

';

మగ్గుతున్న సమయంలో టమాటో ముక్కలు వేసి మరో ఐదు నిమిషాల పాటు వేపుకోండి. ఆ తర్వాత మిర్చి పౌడర్ వేసి కొద్దిగా నీరు పోసుకొని ఉడకనివ్వాలి.

';

బాగా ఉడికిన తర్వాత అందులో ధనియా పౌడర్ వేసుకొని, పైనుంచి కొత్తిమీర చల్లి దింపుకోండి. ఇలా తయారు చేసుకున్న కర్రీని మధుమేహం ఉన్నవారు రెండు పూటలా చపాతీల్లోకి తీసుకుంటే చాలా మంచిది.

';

VIEW ALL

Read Next Story