కావలసిన పదార్థాలు: పసుపు - 1/2 టీస్పూన్, కారం పొడి - 1 టీస్పూన్ (మీకు రుచి తగ్గట్టుగా), కొత్తిమీర - కట్ చేసి, నూనె - 2 టేబుల్ స్పూన్లు
';
కావలసిన పదార్థాలు: గరం మసాలా - 1/4 టీస్పూన్, కసూరి మేతి - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి తగ్గట్టుగా, కొద్దిగా నీరు
';
తయారీ విధానం: ముందుగా ఈ కర్రీ ని తయారు చేయడానికి క్యాప్సికం, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
';
ఆ తర్వాత స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకుని ముందుగా ఉల్లిపాయలను వేసుకొని గోధుమ రంగులోకి వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వండి.
';
అన్ని వేగిన తర్వాత పసుపు, మెంతుల పొడి వేసి మరి కాస్త మగ్గనివ్వాలి.. ఆ తర్వాత అందులో క్యాప్సికం వేసి కొద్దిసేపు వేడి మీద అటు ఇటు కలుపుకోండి.
';
మగ్గుతున్న సమయంలో టమాటో ముక్కలు వేసి మరో ఐదు నిమిషాల పాటు వేపుకోండి. ఆ తర్వాత మిర్చి పౌడర్ వేసి కొద్దిగా నీరు పోసుకొని ఉడకనివ్వాలి.
';
బాగా ఉడికిన తర్వాత అందులో ధనియా పౌడర్ వేసుకొని, పైనుంచి కొత్తిమీర చల్లి దింపుకోండి. ఇలా తయారు చేసుకున్న కర్రీని మధుమేహం ఉన్నవారు రెండు పూటలా చపాతీల్లోకి తీసుకుంటే చాలా మంచిది.