కాలీఫ్లవర్ రైస్.. వారంలో ఒక్కసారైనా తింటే పోషకాలే పోషకాలు..

';

కాలీఫ్లవర్ లో బాడికి కావలసిన బోలెడు పోషకాలు లభిస్తాయి.. ఇందులో లభించే పోషకాలు ఏంటో తెలుసుకోండి.

';

పోషక విలువలు: కాలీఫ్లవర్‌లో విటమిన్ C, విటమిన్ K, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

';

తక్కువ కేలరీలు: కాలీఫ్లవర్ తక్కువ కేలరీలు కలిగి ఉండి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

';

ఆరోగ్యకరమైన గుండె: కాలీఫ్లవర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

';

విరోధక శక్తి: విటమిన్ C అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

';

మంచి జీర్ణక్రియ: కాలీఫ్లవర్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

';

కాలీఫ్లవర్ రెసిపీలో శరీరానికి అత్యంతమైన పోషకాల అందించే వాటిల్లో ముందుండేది కాలీఫ్లవర్ రైస్..

';

ఈ కాలీఫ్లవర్ రైస్ ను మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా సులభంగా చేసుకోండి.

';

కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ ముక్కలు - 1 కప్పు, అన్నం - 1 కప్పు, క్యాప్సికం - 1, బేబీ కార్న్ - 5, ఉల్లికాడలు - 3, సోయాసాస్ - 1 స్పూను

';

కావలసిన పదార్థాలు: ఉప్పు - రుచికి సరిపడా, మిరియాల పొడి - చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు - 5, పచ్చి బఠానీలు - 1/4 కప్పు, కొత్తిమీర తరుగు - 2 స్పూన్లు

';

తయారీ విధానం: కాలీఫ్లవర్ చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.

';

స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేయాలి. రుబ్బుకున్న కాలీఫ్లవర్ మిశ్రమాన్ని వేసి 5-7 నిమిషాలు చిన్న మంట మీద రోస్ట్ చేయాలి.

';

సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు, పచ్చి బఠానీలు వేసి వేయించుకోవాలి. చిన్న ముక్కలుగా కోసిన క్యాప్సికం, బేబీ కార్న్‌లను కూడా వేసి వేయించాలి.

';

ఉప్పు, మిరియాల పొడి చల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత సోయాసాస్ వేసి కలపాలి.

';

ముందుగా ఉడికించుకున్న అన్నం వేసి కలపాలి. కొత్తిమీర తరుగును చల్లుకొని సర్వ్ చేసుకుని తింటే భలే ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story