ఈ రోజుల్లో మనకు ఉన్న ఆహారపు అలవాట్లు.. ఒత్తిడి.. వల్ల చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల డైటింగ్ చేసిన తగ్గలేకున్నామని కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు.
మరి అలాంటివారికి ఈ డీటాక్స్ వాటర్ ..ఒక్క గొప్ప వరం. ఈ డీటాక్స్ వాటర్ ని ఎలా చేసుకోవాలో చూద్దామా.
ముందుగా ఒక పెద్ద గ్లాస్ జారులో.. రెండు కప్పుల నీళ్లను వేసుకోవాలి.
తరువాత అందులో రౌండ్ గా కట్ చేసుకున్న.. రెండు నిమ్మకాయ ముక్కలను వేసుకోవాలి.
అందులోనే ఒక పెద్ద కీరదోసకాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి.
అలాగే ఒక చిన్న కప్పుడు పుదీనాను కూడా అందులో వేసుకోవాలి. చివరిగా రెండు స్పూన్ల చియా సీడ్స్ ను వేసుకోవాలి.
దీన్ని రాత్రంతా మూత పెట్టి అలాగే వదిలేయాలి. ఉదయాన పరగడుపునే ఈ నీళ్లను తీసుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరిగి..బరువు తగ్గడానికి తోడ్పడుతుంది
ముఖ్యంగా ఇందులో ఉండే చియా విత్తనాలు.. మీ బరువుని తగ్గించడంలో ఎంతో సహాయ పడుతాయి.