మొండి కొవ్వును మంచులా కరిగించే డ్రింక్..

Dharmaraju Dhurishetty
Jun 16,2024
';

ముఖ్యంగా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు చాలామంది అనేక రకాల ఇంటి చిట్కాలను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఫలితం పొందలేకపోతున్నారు.

';

శరీరంలోని చెడు కొవ్వు కరిగించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో సులభమైనది ఈ మార్గం.

';

రోజు ఉదయం పూట అల్లం నీటిని తాగడం వల్ల సులభంగా శరీరంలోని కొలెస్ట్రాల్ కరుగుతుంది.

';

అలాగే ఈ అల్లం నీటిలో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.

';

మీరు కూడా అల్లం నీటిని ఇంట్లోనే తయారు చేసుకొని తాగాలనుకుంటున్నారా? ఇలా తయారు చేసుకోండి.

';

అల్లం నీరు తయారీకి కావలసిన పదార్థాలు: ఒక అంగుళం అల్లం ముక్క (తొక్క తీసినది), ఒక గ్లాసు నీరు (250 మి. లీ), ఒక టేబుల్ స్పూన్ తేనె లేదా నిమ్మరసం

';

తయారీ విధానం: ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు నీటిని వేడి చేసుకోవాల్సి ఉంటుంది.

';

మరిగిన నీటిలో, అల్లం ముక్కను వేసి, 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి.

';

ఆ తర్వాత ఈ నీటిని బాగా వడకట్టుకుని పది నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి.

';

ఇలా పక్కన పెట్టుకున్న నీటిలో కాస్తంత నిమ్మరసం, తేనె కలుపుకొని తాగొచ్చు. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే తాగితే మంచి ఫలితాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story