100 రకాల టిఫిన్లకు.. ఆల్ ఇన్ వన్ చట్నీ.. ఈ రెసిపీ మీకు తెలుసా?

Dharmaraju Dhurishetty
Jan 01,2025
';

ఎన్ని రకాల టిఫిన్లు అయినా కేవలం ఒకే ఒక చట్నీతో సరి పెట్టుకోవచ్చు. ఆ చట్నీ ఏంటో మీ అందరికీ తెలుసా?

';

అల్పాహారం లోకి చట్నీ అంటే అందరికీ గుర్తొచ్చేది పల్లీల చట్నీ.. కానీ దీనికంటే టేస్ట్ నిచ్చే అద్భుతమైన చట్నీ రెసిపీని మీకు అందించబోతున్నాం.

';

పల్లీల చట్నీ కంటే పుట్నాల చట్నీ అన్ని అల్పాహారాల్లోకి చాలా బాగుంటుంది. చాలామంది పుట్నాల చట్నీ ని ఎక్కువగా తింటూ ఉంటారు.

';

అయితే పుట్నాల చట్నీ చేసుకునే సమయంలో చాలామంది కొన్ని పొరపాట్లు పడుతున్నారు దీనివల్ల సరైన టెస్ట్ ను పొందలేకపోతున్నారు.

';

పుట్నాల చట్నీ ని ఇంట్లో ఎంతో సులభంగా అన్ని అల్పాహారాలకు సరిపోయే విధంగా తయారు చేసుకోవచ్చు. అదిలాగో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

';

పుట్నాల చట్నీ తయారీ విధానం, కావలసిన పదార్థాలు: పుట్నాలు - 1 కప్పు, పల్లీలు - 1/2 కప్పు, పచ్చిమిర్చి - 4-5, వెల్లుల్లి రెబ్బలు - 2-3, చింతపండు - కొద్దిగా, ఉప్పు - రుచికి సరిపడా

';

కావలసిన పదార్థాలు: నూనె - 1 టేబుల్ స్పూన్, ఆవాలు - 1/2 టీ స్పూన్, జీలకర్ర - 1/2 టీ స్పూన్, కరివేపాకు - కొద్దిగా

';

పుట్నాల చట్నీ తయారీ విధానం: ఈ ఆల్ ఇన్ వన్ చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా పుట్నాలను తీసుకొని ఓ బౌల్లో వేసుకోవాల్సి ఉంటుంది. అందులోనే కొన్ని పల్లీలను కూడా వేసుకొని బాగా వేపుకోండి.

';

ఇలా వేపుకున్న తర్వాత అందులోనే తగినంత చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోనే కొద్దిగా నీటిని వేసుకొని మరికొద్దిసేపు గ్రైండ్ చేసుకోండి.

';

ఆ తర్వాత స్టవ్ పై పోపు కోసం ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో తగినంత నూనె లేదా నెయ్యిని వేసుకొని అన్ని రకాల పోపు దినుసులు వేసి బాగా వేపుకోండి.

';

ఇలా వేపుకున్న తర్వాత పసుపు, కరివేపాకు వేసుకొని బాగా వేపిన తర్వాత.. ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్న చట్నీలో కలుపుకోండి అంతే..

';

VIEW ALL

Read Next Story