మీ నడుము భాగం సన్నగా చేయాలంటే ఈ ఆహారాన్ని.. మీ రోజు వారి ఆహారంలో చేర్చండి.
కీరకాయి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నడుము భాగం కొవ్వును తగ్గిస్తుంది. కాబట్టి రోజు స్నాక్స్ బదులు కీరకాయ తినండి.
నిమ్మరసం నీరు శరీరంలో కొవ్వు కరిగేందుకు ఉత్తమమైన మార్గం. కాబట్టి మీ రోజుని ని నిమ్మరసం కలిపిన నీళ్లతో ప్రారంభించండి.
బాదం, వాల్‌నట్స్ తినడం శరీరానికి పోషకాలను అందించి కొవ్వును తగ్గిస్తుంది. సాయంత్రం పూట ఇవి మితంగా తీసుకోవడం మంచిది.
స్వీట్, కూల్ డ్రింక్స్ వంటి అధిక చక్కెర పదార్థాలను తగ్గించడం తప్పనిసరి.
నిలకడగా నీటిని తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. కాబట్టి తప్పకుండా రోజుకి 7 నుంచి 8 లీటర్ల నీళ్లు తాగాలి.
రోజుకు 30 నిమిషాల వ్యాయామం మీకు చాలా అవసరం. ఇలా ఒక నెలరోజులు చేసి చూడండి.. మార్పు మీకే తెలుస్తుంది.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.