సోయాలో ఒంటికి అవసరమైన పోషకాలు ఎన్నో లభిస్తాయి మటన్ లో ఎన్ని పోషక విలువలు ఉంటాయో.. దానికి సమానమైన పోషకాలు సోయాలో ఉంటాయి.
అలాంటి సోయాతో.. టేస్టీగా చేసుకునే.. క్రిస్పీ సోయా చూద్దామా.
ముందుగా ఒక గిన్నెలో అరకప్పు పెరుగుని, బాగా కలుపుకోవాలి.
అందులోనే ఒక స్పూను కాశ్మీరీ కారంపొడి,nఅర స్పూను ధనియాల పొడి, పావు స్పూను గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్.. వేసుకొని బాగా కలుపుకోవాలి.
అందులో వేడినీటిలో రెండు నిమిషాలు ఉంచిన సోయాని వేయాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
తరువాత అందులో ఒక స్పూను కాన్ ఫ్లోర్ ని వేసి కలుపుకోవాలి.
ఇపుడు..ఒక కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె వేసుకుని వేడి చేసుకోవాలి.
నూనె వేడయ్యాక ఈ సోయాని.. ఒక్కొక్కటిగా వేసుకొని గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ సోయా రెడీ.