ITR on WhatsApp: ఐటీ రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయలేదా, ఇప్పుడిక వాట్సప్ నుంచి కూడా రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. అెదెలాగో తెలుసుకుందాం.
ఐటీ రిటర్న్స్ ఇక నుంచి వాట్సప్ ద్వారా సులభంగా ఫైల్ చేయవచ్చు.
Clear Tax ద్వారా ఇది చాలా సులభమైంది. వాట్సప్ ద్వారా సంభాషించి ట్యాక్స్ ఫైల్ చేయవచ్చు.
ఈ ప్రక్రియ ద్వారా చాలామందికి లాభం కలుగుతోంది. ప్రత్యేకించి ఆదాయం తక్కువగా ఉండి ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 ఫామ్ సమర్పించేవారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది
వాట్సప్ ద్వారా ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయవచ్చో. ఆ ప్రక్రియ ఏంటో తెలుసుకుందాం.
Clear Tax వాట్సప్ నెంబర్ మీ మొబైల్ లో సేవ్ చేసుకుని హయ్ అని మెస్సేజ్ పెట్టండి
నచ్చిన లాంగ్వేజ్ ఎంచుకోండి. మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. ముఖ్యంగా ఫామ్ 16 పంపించాలి.
ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 ఫిల్ చేసేందుకు ఏఐ బాట్ సూచనలు ఫాలో అవండి
ఫామ్ ఫిల్ చేశాక రివ్యూ చేసుకోండి. ఏమైనా కరెక్షన్లు ఉంటే సరి చేసుకోండి
ఫామ్ సమర్పించేందుకు వాట్సప్ నుంచి పేమెంట్ చేయండి. ఆ తరువాత మీకొక నిర్ధారణ మెస్సేజ్ వస్తుంది. దాంతోపాటు నెంబర్ వస్తుంది.