ఈమధ్య కాలంలో పిజ్జా అందరికీ ఫేవరెట్ డిష్ గా మారిపోయింది. అయితే దీనిని ఇంట్లోనే సులభమైన పద్ధతుల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
రెండున్నర కప్పుల ఆల్ పర్పస్ పిండి, ఒక కప్పు గోరువెచ్చని నీరు, 2 1/4 టేబుల్ స్పూన్ ఆక్టివ్ డ్రై ఈస్ట్, ఒక టేబుల్ స్పూన్ చక్కర, రెండు టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు,
ఒక డబ్బా టమాటో సాస్, రెండు టేబుల్ స్పూన్ల టమాటో పేస్ట్, రెండు లవంగాలు, రెండు వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ ఎండిన ఒరేగానో, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ ఎండిన తులసి, హాఫ్ టేబుల్ స్పూన్ చక్కెర, ఉప్పు రుచికి సరిపడా
గిన్నెలో ఈస్ట్, చక్కెర , నీరు వేసి నురుగు వచ్చేవరకు ఐదు నిమిషాలు కలపాలి. తర్వాత మరో గిన్నెలో పిండి, ఉప్పు, ఈస్ట్ మిశ్రమం, ఆలివ్ ఆయిల్ వేసి ముద్దలా తయారు చేయాలి.
జారుడుగా పిండి తయారు చేసి, మరో గిన్నె లో నూనె రాసి అందులో పిండి ఉంచాలి. తడిగా ఉన్న గుడ్డ తో కప్పి వెచ్చని ప్రదేశంలో సుమారుగా గంటన్నర పెట్టాలి.
సాస్ పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి మెత్తగా తరిగిన వెల్లుల్లి వేసి టొమాటో సాస్, టొమాటో పేస్ట్, ఒరేగానో, తులసి , ఉప్పు, చక్కెర, మిర్యాల పొడి అన్ని వేసి వేయించాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలి.
పక్కన పెట్టుకున్నది పిండిని బాగా పిసికి రెండు సమాన భాగాలుగా చేయాలి.. పెద్ద పిజ్జా కోసం ఒకటి పక్కన పెట్టుకోవాలి.. పిండి ఉపరితలంపై కావాల్సిన అంత మందం కోసం పిండి తీసుకొని రొట్టెల చేసి.. దానిపైన తయారు చేసి పెట్టుకున్న సాస్ వేసి, దానిపైన తురిమిన మోజారెల్లా, చ
ముందుగా వేడి చేసిన షీట్ పై జాగ్రత్తగా పెట్టి.. మరో 15 నిమిషాలు బంగారు రంగు వచ్చేవరకు రెండు పక్కల కాల్చాలి. అంతే రుచికరమైన పిజ్జా తయారవుతుంది.