రాగి పండితో చేసిన రోటీలు తింటే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
';
ముఖ్యంగా ఈ పిండితో తయారు చేసిన రోటీలు తింటే సులభంగా బరువు తగ్గుతారు.
';
అలాగే ఈ రోటీలు శరీరంలోని షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు కూడా ఎంతో సహాయపడతాయి.
';
తరచుగా గుండె సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ రోటీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
';
ఇందులో ఉండే గుణాలు ఎముకలను కూడా ఆరోగ్యంగా చేస్తాయి.
';
తరచుగా చర్మ సమస్యతలో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ రాగి రోటీలను తినండి.
';
రాగి పండి రోటీలకి కావలసిన పదార్థాలు: రాగి పిండి - 2 కప్పులు, గోధుమ పిండి - 1/2 కప్పు (కావాల్సినంత), ఉప్పు - రుచికి తగినంత, నూనె, నీరు - అవసరమైనంత
';
తయారీ విధానం..పిండి కలిపే విధానం: ముందుగా ఒక పాత్రలో రాగి పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా కలపండి.
';
ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీరు పోస్తూ.. మొత్తని పిండిలా కలపాల్సి ఉంటుంది. ఈ పిండి చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి.
';
ఇలా చేయండి: కలిపిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాల్సి ఉంటుంది. అరటి ఆకులతో కాసేపు మూసి ఉంచి పక్కన పెట్టుకోవాలి.
';
రోటీల్లా తయారు చేసుకోండి: పిండి ముద్దలు తీసుకొని, చిన్న చిన్న రోటీలుగా ఒత్తుకోవాల్సి ఉంటుంది. తర్వాత వేడి వేడి తవాపై రెండు వైపులా నూనె రాసి బాగా వేయండి. అంతే సుభంగా రోటీలు రెడీ అయినట్లే.
';
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఉదయాన్నే ఈ రోటీలు తినడం చాలా మంచిది.