స్ట్రాబెర్రీల డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినొచ్చా..?
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో స్ట్రాబెర్రీ పండు ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల అనేక రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే ఈ పండు డయాబెటిస్ వారికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుంది అనేది మనం తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఈ లక్షణాలు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగపడుతాయి. స్ట్రాబెర్రీల్లో సహజమైన తీపితో పాటు తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటుంది. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి.
స్ట్రాబెర్రీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు బరువు నియంత్రణలో ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. చెడుకొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం కూడా ఉపయోగపడుతుంది.
స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ నియంత్రించడంలో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు స్ట్రాబెర్రీలను పెరుగుతో లేదా సలాడ్‌లలో కలిపి తినవచ్చు. దీని వల్ల బోలెడు ఆరోగ్య లాభాలు కలుగుతాయి.
స్ట్రాబెర్రీలు తీసుకోవడం వల్ల శరీరా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారు స్ట్రాబెర్రీలను అతిగా తీసుకోకుండా మితంగా తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు స్ట్రాబెర్రీలు సుమారు 15 గ్రాముల కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను పెంచే అవకాశం ఉంటుంది.