శరీరం నుంచి రియాక్టివ్ ఆక్సిడేటివ్ అని పిలిచే టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది. ఐరన్ గ్రహించడంలోనూ సహాయం చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.
ఐరన్ ఫ్యాక్డ్ ప్లాంట్ బేస్డ్ మీల్స్ తో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మీ శరీరానికి కావాల్సినంత ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది.
ఈ యాంటీఆక్సిడెంట్ కంటిశుక్లం నుంచి కాపాడటంతోపాటు వయస్సు సంబంధిత మచ్చలను తగ్గిస్తుంది.
విటమిన్ సి కొల్లాజెన్ పెరుగుదలకు సపోర్టు చేస్తుంది. మీ శరీరానికి కావాల్సిన వైద్య ప్రక్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
విటమిన్ సి చర్మానికి అన్ని రకల మేలు చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిగా తగ్గించడంలో సహాయపడుతుంది. కంటి కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది.
విటమిన్ సి ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది మీ కణాలను దెబ్బతీసే, ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించి, ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. ఫలితంగా వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.
విటమిన్ సి ఒక పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది సెల్ డ్యామేజ్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.