బృందావన్ లో నిర్మించిన ప్రేమ మందిరం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి సందర్శకులు ఇక్కడి వస్తారు.
తెల్లనిపాలరాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు.
బృందావన్ మందిరాన్ని ఎవరు నిర్మించారో తెలుసుకుందాం.
ఈ బృందావన్ ప్రేమ మందిరాన్ని జగద్గురు క్రుపాలు మహారాజ్ నిర్మించారు.
ఈ మందిరం శ్రీ రాధాక్రిష్ణులకు అంకింతం చేశారు.
ఈ అందమైన ఆలయాన్ని ఐదవ జగద్గురువు కృపాలు మహారాజ్ స్థాపించారు. వెయ్యి మంది కూలీలతో 11 ఏళ్లలో ఆలయాన్ని పూర్తి చేశారు.
ఈ అందమైన ఆలయ నిర్మాణం జనవరి 2001లో ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవ వేడుక 15 ఫిబ్రవరి 2012న జరిగింది. అనంతరం ఫిబ్రవరి 17న భక్తుల కోసం తెరిచారు. ఆలయం ఎత్తు 125 అడుగులు, పొడవు 122 అడుగులు.
ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఇది పగటిపూట పూర్తిగా తెల్లగా కనిపిస్తుంది. సాయంత్రం, ఆలయం రంగు కాంతిలో భిన్నంగా కనిపిస్తుంది.
మధుర రైల్వే స్టేషన్ ప్రేమ్ మందిర్ నుండి 12 కి.మీ దూరంలో ఉంది. సమీప విమానాశ్రయం 54 కి.మీ దూరంలో ఉన్న ఆగ్రా. ప్రేమ్ మందిర్ రోడ్డు ద్వారా వెళ్లాలి.