గ్రీన్ టీలో ఉండే గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను సులభంగా కరిగిస్తుంది. ఇవేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
గ్రీన్ టీ ఆకులతో తయారు చేసిన టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చాలా మంది ఆరోగ్యనిపుణులు సైతం ఈ గ్రీన్ టీ తాగాలని సూచించారు.
అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజూ గ్రీన్ తాగడం వల్ల బరువు తగ్గుతారు. అయితే ఈ టీలో కొన్ని ప్రత్యేకమైన వాటిని జోడిస్తే దాటి లక్షణాలు చాలా పెరుగుతాయి.
గ్రీన్ టీలో అల్లాన్ని కలిపి తీసుకుంటే అనేక సమస్యలు దూరమవుతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. బరువు కూడా తగ్గుతారు.
గ్రీన్ టీలో పుదీనా, దాల్చిన చెక్క వేసుకుని ప్రతిరోజు తాగితే బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
గ్రీన్ టీలో నిమ్మకాయను కలిపి తీసుకుంటే రుచితోపాటు సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
కొలెస్ట్రాల్ వల్ల ఎక్కువ మంది గుండె జబ్బుల బారిన పడుతుంటారు. ఈ సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తగా గ్రీన్ టీ తాగడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
గ్రీన్ టీలో ఉండే పాలీ ఫెనాల్స్ స్కిన్ ను ఫ్రీ రాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. ముడతలు రాకుండా చేస్తాయి. దీంతో కొలాజెన్ ఏజీయింగ్ ను ఆలస్యం చేస్తాయి.
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా పొందండి.