Stomach Bloating: మందార పువ్వుల హెర్బల్ టీ తాగితే బీపీ నుంచి కడుపులో అల్సర్ వరకు తగ్గడం ఖాయం

';

కడుపు ఉబ్బరం

మనలో చాలా మంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతుంటారు. మనం ఆహారం తింటున్న సమయంలో గాలి జీర్ణవ్యవస్థ పొడవునా పెరిస్టాలిటిక్ చలనం రూపంలో వెళ్తుంది.

';

జీర్ణాశయం

కడుపులోకి వెళ్లిన గాలి తేన్పుల రూపంలో బయటకు వస్తుంది. పైకి రాక కిందికిపోక పేగులు, జీర్ణాశయంలో చిక్కుకుపోయి పొట్ట రాయిలాగా, కడుపు ఉబ్బరంగా ఉంటుంది.

';

మలబద్ధకం

ఈ సమస్యను పట్టించుకోకపోతే దీర్ఘకాలంలో బలబద్దకం, హైపర్ ఎసిడిటీతోపాటు మరికొన్ని అనారోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

';

జీవనశైలిలో మార్పులు

మీరు ఆహార నియామాలతోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే మందారపువ్వులతో తయారు చేసిన హెర్బల్ టీ తాగితే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చూద్దాం.

';

ఉబ్బరం తగ్గించడంలో

మందార పువ్వులతో తయారు చేసిన టీ కడుపులో ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు అల్సర్ వంటి రోగాలను కూడా నయం చేస్తుంది.

';

ఆమ్లాలు

మందారపువ్వులో ఉండే తేలికపాటి ఆమ్లాలు భేదిమందుగా పనిచేసి జీర్ణక్రియకు సహాయపడుతాయి. గుండెల్లో మంట, కడుపు తిమ్మిరి, గ్యాస్ట్రోఎంటెరిటిస్, గ్యాస్ ను కూడా తగ్గిస్తుంది.

';

రక్తపోటు

మందార టీ రక్తపోటును కూడా తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను కూడా కంట్రోల్ చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.

';

యాంటీఆక్సిడెంట్లు

మందారపువ్వులో మినరల్స్, పాలీఫెనాల్స్, ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. భోజనం చేసిన తర్వాత వేడి వేడి మందార హెర్బల్ టీ తాగితే జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. అందులో అల్లం, నిమ్మకాయను కూడా జోడించుకోవచ్చు.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story