ఆకుపచ్చ బాదంలో విటమిన్ ఇ, ఇమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఆకుపచ్చ బాదం తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.
ఆకుపచ్చ బాదంపప్పును తింటే చర్మం తేమను కాపాడుతుంది. ఎందుకంటే వీటిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.
మీకు జీర్ణసంబంధిత సమస్యలు ఉన్నట్లయితే పచ్చి బాదం పప్పును తినాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది.
పచ్చి బాదంపప్పును తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాదు శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
పచ్చి బాదంలో పొటాషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి మీ ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి.
మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే మీరు పచ్చి బాదం పప్పులను తినాలి. ఇది మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది.