మీ శరీరాన్ని, ముఖాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతిరోజూ కనీసం 7-8 గ్లాసుల నీరు తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి ముఖానికి గ్లోని ఇస్తుంది.
మీ ముఖంపై మచ్చలు తొలగిపోవాలంటే కలబందను ఉపయోగించాలి. ముఖంపై కలబందతో రాస్తే ముఖంలో మెరుపు వస్తుంది.
మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చుకునేందుకు తేనెను ఉపయోగించుకోవచ్చు. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని ముఖానికి రాసుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
సగం పండిన అరటిపండును పాలలో గ్రైండ్ చేసి ముఖానికి పట్టించి పది నిమిషాలు ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కొవాలి ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది.
లాక్టిక్ యాసిడ్ పెరుగులో ఉంటుంది. ఇది సహజ బ్లీచ్ వలే పనిచేస్తుంది. పెరుగుతో ముఖానికి మర్దన చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం శుభపడుతుంది.
మీరు మీ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే ఎన్నో హోం రెమెడీస్ ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
కొంతమంది ముఖాన్ని తెల్లగా మార్చుకునేందుకు స్కిన్ కేర్ ప్రొడక్టులను ఉపయోగిస్తుంటారు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇతర సమస్యలు తలెత్తుతాయి.
చాలా మంది ముఖంపై నల్లని మచ్చలు, మొటిమలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖంపై మచ్చలు తగ్గి ఆకాశంలోని నక్షత్రంలా మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే.