చలికాలంలో చలి తీవ్రత వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. కాళ్లపగుళ్లు, పెదాలు పగిలిపోవడం, చర్మం డ్రైగా మారతుంది.
ఈవింటర్ సీజన్ లో చర్మ సమస్యలు, పెదాలు పగుళ్ల వల్ల చాలా మంది విసిగిపోతుంటారు. పెదాల పగుళ్ల వల్ల తీవ్రమైన అసౌకర్యం ఉంటుంది.
పెదాల పగుళ్లు ఏర్పడిన తర్వాత ఇబ్బందులు పడటం కంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది. ఈ టిప్స్ చాలా అద్బుతంగా పనిచేస్తాయి.
ఒక బౌల్ తీసుకుని అందులో2 టేబుల్ స్పూన్ల వరకు షియా బటర్ ను వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి మరిగించుకోవాలి.
మరుగుతున్న నీళ్లలో షియా బటర్ వేసి కరిగించుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, తేనె, కోకోనట్ ఆయిల్ వేయాలి. లెమెన్ ఎసెన్షియల్ కూడా వేయాలి.
వీటన్నింటిని మిక్స్ చేసిన తర్వాత ఒక బాక్స్ తీసుకుని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. రెండు గంటలపాటు అలాగే వదిలేయాలి.
బాక్స్ లో మిశ్రమం గడ్డ కట్టి లిప్ బామ్ రెడీ అవుతుంది. దీన్ని రోజుకు రెండు నుంచి మూడు సార్ల వరకు పెదాలకు రాసుకోవచ్చు.
పెదాలు పొడిబారకుండా ఉండేందుకు రోజుకు రెండు లేదా మూడు సార్లు రాసుకుంటే తేమగా ఉంటాయి. చలికాలంలో పెదాల పగుళ్లతో బాధపడే వాళ్లు ఎలాంటి సమస్య లేకుండా ఉండవచ్చు.