Dry Lips Home Remedies : చలికాలంలో పెదవులు పగలగుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Bhoomi
Nov 26,2024
';

చలికాలం

చలికాలంలో చలి తీవ్రత వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. కాళ్లపగుళ్లు, పెదాలు పగిలిపోవడం, చర్మం డ్రైగా మారతుంది.

';

పెదాలు పగిలి

ఈవింటర్ సీజన్ లో చర్మ సమస్యలు, పెదాలు పగుళ్ల వల్ల చాలా మంది విసిగిపోతుంటారు. పెదాల పగుళ్ల వల్ల తీవ్రమైన అసౌకర్యం ఉంటుంది.

';

ఇంటి చిట్కాలు

పెదాల పగుళ్లు ఏర్పడిన తర్వాత ఇబ్బందులు పడటం కంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది. ఈ టిప్స్ చాలా అద్బుతంగా పనిచేస్తాయి.

';

షియా బటర్

ఒక బౌల్ తీసుకుని అందులో2 టేబుల్ స్పూన్ల వరకు షియా బటర్ ను వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి మరిగించుకోవాలి.

';

నీళ్ల షియా బటర్

మరుగుతున్న నీళ్లలో షియా బటర్ వేసి కరిగించుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, తేనె, కోకోనట్ ఆయిల్ వేయాలి. లెమెన్ ఎసెన్షియల్ కూడా వేయాలి.

';

వీటిని మిక్స్ చేసి

వీటన్నింటిని మిక్స్ చేసిన తర్వాత ఒక బాక్స్ తీసుకుని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. రెండు గంటలపాటు అలాగే వదిలేయాలి.

';

లిప్ బామ్ రెడీ

బాక్స్ లో మిశ్రమం గడ్డ కట్టి లిప్ బామ్ రెడీ అవుతుంది. దీన్ని రోజుకు రెండు నుంచి మూడు సార్ల వరకు పెదాలకు రాసుకోవచ్చు.

';

పెదాలు పొడి బారకుండా

పెదాలు పొడిబారకుండా ఉండేందుకు రోజుకు రెండు లేదా మూడు సార్లు రాసుకుంటే తేమగా ఉంటాయి. చలికాలంలో పెదాల పగుళ్లతో బాధపడే వాళ్లు ఎలాంటి సమస్య లేకుండా ఉండవచ్చు.

';

VIEW ALL

Read Next Story