పెనుముకి దోసె అంటకుండా చేయాలంటే.. ఈ చిన్ని చిన్ని చిట్కాలు పాటించాల్సిందే.
పెనాన్ని సరిగా శుభ్రపరచి.. ఆ తరువాత బాగా వేడి చేసి.. కొంచెం నూనె రాశాక మాత్రమే దోస కోసం పెనుముని వాడాలి.
వేడిచేసిన పెనుమీద కొంచెం ఉప్పు రాసి తుడవడం దోసె అంటకుండా చేస్తుంది.
పెనుమీద వేడి ఎక్కువగా ఉండకూడదు, అదుపులో ఉంచాలి.
దోసె కాల్చేటప్పుడు తక్కువ నూనె వాడటం మంచిది.
అన్నిటికన్నా ముఖ్యంగా ఒక దోస వేసిన తరువాత.. మరో దోస పోసే ముందర..పెనుమీద ఉల్లిపాయ ముక్క రాస్తే.. పెనము మీద దోస కరుచుకోకుండా ఉంటుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.