Ghee Roast Dosa: నోరూరించే నెయ్యి దోశ..ఇలా అప్పటికప్పుడు కార కారంగా చేసుకోండి

';

నెయ్యి రోస్ట్ దోశ

ఘీ రోస్ట్ దోశ ఫేమస్ సౌతిండియన్ టిఫిన్. ఈ దోశను నెయ్యితో తయారు చేస్తారు. క్రిస్పిగా ఉంటుంది. ఫేమస్ దోశల్లో ఇది ఒకటి. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం.

';

కావాల్సిన పదార్ధాలు

3 కప్పులు బియ్యం, 1/2టీస్పూన్ మెంతులు, 1 కప్పు మినపప్పు, 2 కప్పుల అన్నం, రుచికి సరిపడా ఉప్పు, అవసరాన్నిబట్టి నెయ్యి

';

దశ 1

బియ్యం, మెంతులు కలిపి 5 గంటలపాటు నానబెట్టాలి.మినపప్పును 3 గంటల పాటు నానబెట్టాలి.

';

దశ 2

మినపప్పు, బియ్యం నానిన తర్వాత రెండింటిని పేస్టు చేసుకోవాలి. అందులో అన్నం వేసి గ్రైండ్ చేసుకోవాలి.

';

దశ 3

ఈ పిండిని రాత్రంతా పులియబెట్టాలి. పిండిపులిసిన తర్వాత అందులో ఉప్పు వేసుకోవాలి.

';

దశ 4

ఇప్పుడు స్టౌ మీద దోశ ప్యాన్ పెట్టి కొద్దిగా వేడి అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి.

';

దశ 5

కొద్దిగా వేడెయ్యాక పిండిని వేసి రౌండ్ గా దోశ వేసుకోవాలి. సన్నగా వేసుకోవాలి.

';

దశ 6

ఇప్పుడు దోశ మీద నెయ్యి రాసి బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు కాల్చాలి. కొంచెం కారం కావాలనుకుంటే దానిపై ఎండు కారం పొడిని చల్లుకోవచ్చు.

';

దశ7

దోశ బాగా కాలిన తర్వాత ఒక ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీ కానీ టమోటా చట్నీ కానీ అల్లంతో కానీ సర్వ్ చేసుకుంటే రుచి అద్బుతంగా ఉంటుంది. నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story