ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉణ్నాయి. చలికాలంలో ఉసిరికాయలు విరిగా లభ్యం అవుతాయి.
చలికాలంలో ఉసిరికాయ రోజు రెండు ముక్కలు తీంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఎండిన ఉసిరి ముక్కలు ఆయుర్వేదం షాపుల్లో అందుబాటులో ఉంటాయి.
ప్రతిరోజు ఉసిరి కాయ తింటే వృద్ధాప్య లక్షణాలను కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఉసిరికాయ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఉసిరికాయ ముక్కలతో పచ్చడి పెట్టుకుంటే ఏడాది పొడవునా నిల్వ ఉంటుంది. ఉసిరి ముక్కలను నోంట్లో వేసుకుంటే నోటి పొక్కులు రాకుండా ఉంటాయి.
ఉసిరిముక్కలను రోజూ తింటే నోటిపూత సమస్య తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఉసిరికాయ తింటే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. యవ్వనంగా ఉండేందుకు కూడా ఉసిరికాయను ప్రతిరోజూ తినవచ్చు.
ఉసిరికాయ ముక్కలను పొడి చేసుకుని కూడా తినవచ్చు. చర్మంపై ముడతలు రాకుండా ఇది కాపాడుతుంది.
ఉసిరిలో కొల్లాజెన్ కణజాలాన్ని రక్షిస్తుంది. అంతేకాదు ఉసిరికాయలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి.