గోధుమపిండితో చేసే వంటకాలు అన్ని మనం అరటికాయ తొక్క పిండితో చేయొచ్చని మీకు తెలుసా..
కేకులు, ఇతర బేకరీ ఉత్పత్తులను తయారీ విధానం కోసం పండ్ల తొక్కలను ఎండబెట్టి, గ్రైండ్ చేసుకోవడం ఎంతో మంచిది..
ఇది ఆరోగ్యకరమైనది కూడా ఎన్నో వైద్య అధ్యాయనాలు కనుగొన్నాయి.
ఈ పండ్ల తొక్కతో చేసిన పిండిని వారడం వల్ల.. అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మనం చేసుకునే కేకులు, రొట్టెలు, కుకీలు వంటి బేకింగ్ ఉత్పత్తులలో సాధారణంగా ఉపయోగించే గోధుమ పిండిలో కనీసం 10 శాతం పండ్ల తొక్కల పొడిని కలుపుకోవడం మంచిది.
ఇలా చెయ్యడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు ఎక్కువ అందుతాయి. అంతేకాకుండా బరువుని కూడా నియమంలో ఉంచుతుంది
ముఖ్యంగా అరటిపండు తొక్కలని పొడి చేసి వాడుకోవడం ఎంతో ఉత్తమం.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి.