ఈ హల్వా మీ కంటి చూపును రెట్టింపు చేస్తుంది..

Dharmaraju Dhurishetty
Aug 25,2024
';

క్యారెట్ హల్వాలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో కంటి చూపులు మెరుగుపరిచే విటమిన్స్ కూడా ఉంటాయి.

';

క్యారెట్ హల్వా తినడం వల్ల కంటిచూపు మెరుగుపరడమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

';

క్యారెట్ హల్వాను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.. మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

కావలసిన పదార్థాలు: క్యారెట్లు - 500 గ్రా, పాలు - 1 లీటర్, పంచదార - 1 కప్పు

';

కావలసిన పదార్థాలు: నెయ్యి - 1/2 కప్పు, యాలకుల పొడి - 1/2 టీస్పూన్, జీడిపప్పు, పిస్తా, బాదం - రుచికి సరిపడా

';

తయారీ విధానం: ముందుగా ఈ క్యారెట్ హల్వా ను తయారు చేసుకోవడానికి క్యారెట్ లను బాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి.

';

ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి, తురిమిన క్యారెట్లను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

అందులోనే పాలు పోసి, క్యారెట్లు మెత్తబడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత పంచదార వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

';

పంచదార మిశ్రమంలా తయారైన తర్వాత హల్వా చిక్కబడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపుకోండి.

';

ఇలా పక్కన పెట్టుకున్న హల్వాలో యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని..జీడిపప్పు, పిస్తా, బాదం తురిమినవి చల్లి అలంకరించాలి.

';

చిట్కాలు: హల్వా మరింత రుచిగా ఉండాలంటే, నెయ్యి బదులుగా నూనె వాడవచ్చు. పంచదారకు బదులుగా బెల్లం వాడవచ్చు.

';

హల్వాను మరింత రుచిగా చేయడానికి, ఎండుద్రాక్ష, ఖర్జూరం వంటివి కూడా వేయవచ్చు.

';

VIEW ALL

Read Next Story