అదితి రావ్ కి ఎగ్ ఎల్లిపాయ కారం అంటే చాలా ఇష్టమట. మరి అది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం..
ముందుగా ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఒక కడాయిలో.. మూడు స్పూన్ల నూనె వేడి చేసుకుని.. అందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి.
తరువాత ఉల్లిపాయలను కూడా వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు గోధుమ రంగు వచ్చిన తరువాత కొంచెం ఉప్పు.. వేసి రెండు పచ్చిమిరపకాయ ముక్కలను.. పొడవుగా కట్ చేసి వేసుకోండి.
మిరపకాయలు కొంచెం వేగిన తరువాత కోడి గుడ్లును..పగల కొట్టి కదపకుండా మూత పెట్టి ఉడకనివ్వండి.
తరువాత ఒక మిక్సర్ జార్ లో.. ఒక పెద్ద వెల్లుల్లిపాయ..ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసి.. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి.
ఈ పౌడర్ ను గుడ్డు మిశ్రమంలో వేసి రెండు నిమిషాలు ఉడికించండి.. అంతే ఎంతో రుచికరమైన గుడ్డు ఎల్లిపాయ కారం రెడీ.
ఈ గుడ్డు ఎల్లిపాయ కారం .. చపాతీ తో తింటే ఎంతో రుచిగా ఉంటుంది