వాల్నట్స్లో ఒమేగా-3 మోనోశాచురేటెడ్ ఫ్యాట్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ మరియు ఇతర పోషకాలు ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను నివారించుకోవచ్చు.
మీరు రోజూ క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చేపలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సాల్మన్, మాకేరెల్, సార్డైన్ మరియు ట్యూనా వంటి చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది.
ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు డార్క్ చాక్లెట్లో ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.
గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ మరియు కాటెచిన్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా కొవ్వును తగ్గిస్తాయి.
కేల్ వెజిటబుల్ లో ఐరన్, క్యాల్షియం, ఫైబర్, పొటాషియం, విటమిన్ సి వంటి న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇవి హృదయ సంబంధింత వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.