గుండె సమస్యలకు చెక్ పెట్టే పచ్చడి..

Dharmaraju Dhurishetty
Jul 31,2024
';

వెల్లుల్లిని పచ్చడిలా తయారు చేసుకొని తినడం వల్ల శరీరానికి అనేక రకాలు లాభాలు కలుగుతాయి.

';

వెల్లుల్లి పచ్చడిలో ఉండే కొన్ని మూలకాలు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి.

';

అలాగే ఈ పచ్చడి శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు కూడా కీలక పోషిస్తుంది.

';

అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

మీరు కూడా వెల్లుల్లి రెబ్బలతో తయారుచేసిన పచ్చడిని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేయండి..

';

వెల్లుల్లి పచ్చడి కి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు - 1 కప్పు, ఎండుమిరపకాయలు - 10 నుంచి 12, ఉప్పు - రుచికి సరిపోయినంత, నూనె - 1 టేబుల్ స్పూన్, కరివేపాకు - కొద్దిగా, ఆవాలు - 1/2 టీస్పూన్

';

తయారీ విధానం: వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఉప్పును కలిపి మిక్సీలో రుబ్బుకోవాలి.

';

ఆ తర్వాత పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి. అందులోనూ ఆవాలు వేసి వేయించుకోవాల్సి ఉంటుంది.

';

ఆవాలు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి మరికొద్ది సేపు వేయించుకోవాలి.

';

ఇలా వేయించుకున్న తర్వాత గ్రైండర్లో రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ పోపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

';

ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఇడ్లీ లేదా చపాతీల్లో రోజు ఉదయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఈ పచ్చడిలో ఉప్పు తక్కువగా వేసుకోవడం చాలా మంచిది.

';

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ పచ్చడిని వైద్యుల సూచనల మేరకే తీసుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story