పిల్లలకి ఆరోగ్యాన్నిచ్చే హెల్తీ స్నాక్ రెసిపీ.. ఇవి తింటే ఆరోగ్యమే, ఆరోగ్యం!
Dharmaraju Dhurishetty
Jan 01,2025
';
చాలామంది వెజ్ రోల్స్ తిని ఉంటారు. ఇవి అద్భుతమైన రుచినందించడమే కాకుండా శరీరానికి బోలెడు లాభాలను అందిస్తాయి.
';
వెజ్ రోల్స్ మామూలుగా వివిధ రకాల కూరగాయలతో తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా క్యారెట్ తురుముతో తయారుచేసిన వెజ్ రోల్ తిన్నారా?
';
క్యారెట్ తురుముతో కూడా వెజ్ రోల్స్ ను తయారు చేయవచ్చు. ఈ వెజ్ రోల్ ఎంతో సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
';
రెసిపీకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి - 1 కప్పు, క్యారెట్ తురుము - 1 కప్పు, ఉల్లిపాయ తరుగు - 1/2 కప్పు, క్యాప్సికం తరుగు - 1/2 కప్పు, క్యాబేజీ తరుగు - 1/2 కప్పు
';
కావలసిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు - 1/2 టీ స్పూన్, గరం మసాలా - 1/2 టీ స్పూన్, ధనియాల పొడి - 1/2 టీ స్పూన్, కారం - 1/2 టీ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - కాల్చడానికి సరిపడా
';
తయారీ విధానం: ముందుగా క్యారెట్ తురుము రోల్స్ తయారు చేసుకోవడానికి.. ఒక గిన్నెలో గోధుమపిండి తీసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని రోటీల పిండిలా నీటిని పోసుకొని కలుపుకోండి.
';
ఇలా కలుపుకున్న తర్వాత స్టఫింగ్ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులో తగినంత నూనె వేసుకుని వేడి చేసుకోండి.
';
ఆ నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేంతవరకు వేయించుకోండి.
';
ఇలా బాగా వేయించుకున్న తర్వాత క్యారెట్ తురుము, క్యాప్సికం తరుగు, క్యాబేజీ తరుగు వేసి కొద్దిసేపు వేయించుకొని పక్కన పెట్టుకోండి.
';
ఆ తర్వాత ముందుగా నా అనిపి పెట్టుకున్న పిండిని చిన్న చపాతీల్లా చేసుకుని అందులో తయారు చేసుకున్న క్యారెట్ తురుము స్టఫింగ్ పెట్టి రోల్ లా చేయాల్సి ఉంటుంది.
';
ఇలా రోల్స్ లా చేసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని హెల్తీగా తినాలనుకునే వారు ఎయిర్ ప్రేయర్ లో బాగా ఫ్రై చేసుకోండి. అంతే సులభంగా వెజ్ రోల్స్ తయారైనట్లే..