లంచ్ బాక్సుల్లోకి అద్భుతమైన కర్రీ రెసిపీ.. ఒక్కసారి తింటే వదలరింక!

Dharmaraju Dhurishetty
Jan 01,2025
';

బీరకాయ పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. అందరూ ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. మీరు కూడా ఇష్టంగా తింటారా?

';

ప్రస్తుతం చాలామంది రెస్టారెంట్ లో నుంచి బీరకాయ పప్పును ఆర్డర్ చేసుకొని మరీ తింటున్నారు. నిజానికి ఇలా బయటి కర్రీలు ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

ఎంతో సులభంగా బీరకాయ పప్పును ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వంటరానికి వారు కూడా దీనిని ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు.

';

మీరు కూడా ఎప్పటి నుంచో బీరకాయ పప్పు కర్రీ ని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి..

';

కావలసిన పదార్థాలు: బీరకాయ - 1 (చిన్న ముక్కలుగా తరిగిన), కంది పప్పు - 1/2 కప్పు, ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన), టమాట - 1 (సన్నగా తరిగిన), పచ్చిమిర్చి - 2 (చీలికలు చేసిన)

';

కావలసిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 టీస్పూన్, పసుపు - 1/4 టీస్పూన్, కారం - 1/2 టీస్పూన్, ధనియాల పొడి - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా

';

కావలసిన పదార్థాలు: నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1/2 టీస్పూన్, జీలకర్ర - 1/2 టీస్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - గార్నిష్ కోసం

';

తయారీ విధానం: ముందుగా ఈ బీరకాయ పప్పును తయారు చేసుకోవడానికి కందిపప్పును నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న కందిపప్పును బాగా శుభ్రం చేసుకోండి.

';

ఒక కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పప్పు, కోసిన బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ, టమాటోలు, పచ్చిమిర్చిలు వేసి నాలుగు విజిల్లు వచ్చేంతవరకు ఉడికించుకోండి.

';

కుక్కర్లో పప్పు బాగా ఉడికిన తర్వాత తగినంత నీటిని వేసుకొని అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి మరో విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోండి.

';

ఇలా పప్పు ఉడికిన తర్వాత దానిని పక్కన పెట్టుకొని.. స్టవ్ పై మరో బౌల్ పెట్టుకొని.. అందులోనే తగినంత నూనెను వేసుకొని.. పోపు దినుసులు వేసి చిటపటలాడేంత వరకు వేయించుకోండి.

';

అన్ని బాగా వేగిన తర్వాత, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తయారు చేసుకున్న పప్పులో పోపుగా వేసుకోండి. అంతే బీరకాయ పప్పు రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story