గుండెను శక్తివంతంగా చేసే లడ్డు..

Shashi Maheshwarapu
Jul 18,2024
';

డ్రై ఫ్రూట్ తో తయారు చేసిన లడ్డును ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి.

';

ముఖ్యంగా బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్ నట్స్ తో తయారు చేసిన లడ్డూలను తినడం వల్ల గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

';

తరచుగా గుండె సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన లడ్డును తినడం వల్ల ఎంతో మంచి ఫలితాలు పొందుతారు.

';

అలాగే డ్రై ఫ్రూట్ లడ్డును తినడం వల్ల వచ్చే గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

అంతేకాదు.. డ్రై ఫ్రూట్స్ తో చేసిన లడ్డు తినడం వల్ల శరీరంలోని పెరిగే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట.

';

డ్రై ఫ్రూట్స్‌లో మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, జింక్ వంటి పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. దీని కారణంగా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది.

';

మీరు కూడా డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకోవాలనుకుంటున్నారా..? ఈ పద్ధతిలో తయారు చేసుకోండి..

';

డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బాదంపప్పులు, 1/2 కప్పు జీడిపప్పు, 1/4 కప్పు వేరుశెనగపప్పు, 1/4 కప్పు పిస్తా

';

కావలసిన పదార్థాలు: 1/4 కప్పు యాలకులు, 1/4 కప్పు ఖర్జూరాలు (బీజాలు తీసినవి), 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు పంచదార (రుచికి అనుగుణంగా), 1/4 టీస్పూన్ యాలకుల పొడి

';

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో బాదంపప్పు, జీడిపప్పు, వేరుశెనగపప్పు, పిస్తా, యాలకులను వేయించి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

వేయించిన డ్రై ఫ్రూట్స్ ను మెత్తగా పొడి చేసుకోండి.

';

ఒక పెద్ద బాణలిలో నెయ్యి వేడి చేసి, ఖర్జూరాలను వేయించి మిశ్రమంలో తయారు చేసుకోండి.

';

ఖర్జూరాలతో పాటు పొడి చేసిన డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది.

';

మిశ్రమం వేడి తగ్గిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని గాలి చొరబడని డబ్బాలో నిలువ చేసుకోండి.

';

ఇలా తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ లడ్డూను రోజు ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి అద్భుతమైన పోషకాలు లభిస్తాయి.

';

VIEW ALL

Read Next Story