జుట్టు సమస్యలు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. జీవనశైలి పాటించే చాలామందిలో ఈ సమస్యలు వస్తున్నాయి.
జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే బట్టతల, చుండ్రు వంటి సమస్యలు రావచ్చు.
ప్రస్తుతం చాలామందిలో పోషకాలలోపం, ఇతర కారణాలవల్ల బట్టతల వస్తోంది. అంతేకాకుండా జుట్టు రంగు కూడా మారిపోతోంది.
జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని నేచురల్ హెయిర్ ఆయిల్స్‌ని వినియోగించాల్సి ఉంటుంది. వీటితో జుట్టు దృఢంగా తయారవుతుంది.
జుట్టు రాలడం ఇతర సమస్యలతో బాధపడే వారికి లావెండర్ ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టును బలంగా చేస్తాయి.
లావెండర్ ఆయిల్‌లో లభించే ఆయుర్వేద గుణాలు జుట్టులో ఇన్ఫెక్షన్ ఇతర సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా జుట్టును మెరిపించేందుకు సహాయపడతాయి.
కలబంద ఆయిల్ కూడా జుట్టుకు ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టును స్ట్రాంగ్ గా చేసేందుకు సహాయపడతాయి.
అలోవెరా ఆయిల్‌లో లభించే ఔషధ గుణాలు తెల్ల జుట్టు నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీంతోపాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
రోజ్మేరీ నూనె కూడా జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టును నిగనిగలాడించేందుకు కూడా సహాయపడుతుంది. జుట్టు సమస్యలు ఉన్నవారు తప్పకుండా ట్రై చేయండి.