వారంలో ఒక్కసారైనా ఈ కర్రీ తింటే శక్తి అమాంతం పెరుగుతుంది!

';

రాజ్మాలో ప్రోటీన్ తో పాటు ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా వ్యాయామాలు చేసే యువత రోజు రాజ్మాను డైట్లో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.

';

డైట్ లో భాగంగా రాజ్మాను తీసుకుంటే శరీరానికి హై ప్రోటీన్ లభిస్తుంది. అంతేకాకుండా కండరాలు కూడా దృఢంగా తయారవుతాయి.

';

మీరు కూడా ఇంట్లోనే అద్భుతమైన టేస్ట్ తో రాజ్మా కర్రీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే తయారు చేసుకోండి.

';

రాజ్మా కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు: రాజ్మా - 1 కప్పు (రాత్రి నుండి నానబెట్టి ఉంచినవి), ఉల్లిపాయ - 2 (తరిగినవి), టమాటా - 2 (తరిగినవి)

';

కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు - 4-5, ఇంచుమించుగా అన్ని మసాలాలు (ధనియాల పొడి, కారం పొడి, కొత్తిమీర పొడి, గరం మసాలా, అల్లం-వెల్లుల్లి పేస్ట్)

';

కావలసిన పదార్థాలు: గోరు చక్కెర - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపోయాంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర - తరిగినది (గార్నిష్ కోసం)

';

తయారీ విధానం..రాజ్మాను ఉడికించడం: నానబెట్టిన రాజ్మాను కుక్కర్‌లో వేసి, అవసరమైనంత నీళ్లు వేసి, ఉప్పు వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఊడిన రాజ్మాను వడకట్టి పక్కన పెట్టుకోవాలి.

';

మసాలా తయారీ: ఒక పాన్‌లో నూనె వేసి వేడెక్కిస్తే, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.

';

తర్వాతి స్టెప్: తరిగిన టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు వేగించాలి. ఇప్పుడు అన్ని మసాలాలు, గోరు చక్కెర వేసి బాగా కలపాలి. ఉడికించిన రాజ్మాను మసాలాలో వేసి బాగా కలుపుకోవాలి.

';

తర్వాతి స్టెప్: కొద్దిగా నీరు లేదా కొబ్బరి పాలు వేసి కాసేపు ఉడికించాలి. రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే హై ప్రోటీన్ రాజ్మా కర్రీ తయారైనట్లే..

';

VIEW ALL

Read Next Story