ఆంధ్ర స్టైల్‌లో పెసరపప్పు అన్నం నూటికి అద్భుతమైన రుచి అందించడమే కాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరానికి శక్తిని అందిస్తాయి.
';
ఎందుకంటే పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది నేరుగా శరీరానికి ప్రోటీన్ అందిస్తుంది. ఇక రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి కూడా అద్భుతమైన లాభాలను అందిస్తాయి.
';
మీరు కూడా ఎప్పటినుంచో మంచి పెసరపప్పుతో ప్రోటీన్ రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్న వారికి ది బెస్ట్ గా భావించవచ్చు.
';
ఇంతకీ పెసరపప్పు అన్నం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: తోటకూర - కొద్దిగా (చిన్న ముక్కలుగా తరిగిన), ఆవాలు - 1/2 టీస్పూన్, జీలకర్ర - 1/4 టీస్పూన్, ఎండు మిరపకాయలు - 2-3
';
కావలసిన పదార్థాలు: కరివేపాకు - కొన్ని రెమ్మలు, పసుపు - 1/4 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 1 టేబుల్ స్పూన్
';
తయారీ విధానం: ముందుగా పెసరపప్పు, బియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా శుభ్రం చేసుకున్న గిన్నెలోనే నీటిని పోసుకొని వాటిని 30 నిమిషాలకు పైగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని అందులో నూనె వేడి చేయాలి. వేడి చేసిన నూనెలోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ వేసి రంగు మారేంతవరకు కలుపుతూనే ఉండాలి.
';
ఆ తర్వాత అవి బాగా రంగు మారిన తర్వాత అందులోని కరివేపాకు వేసుకొని తగినంత ఉప్పు పసుపు వేసుకొని మరికొద్ది సేపు బాగా వేయించుకోండి.
';
ఇలా వేయించుకున్న తర్వాత నానబెట్టిన పెసరపప్పు, బియ్యం వేసుకొని మరో 15 నిమిషాల పాటు బాగా కలుపుకోండి.
';
బాగా కలుపుకున్న తర్వాత చివరగా ఆరు కప్పుల నీటిని పోసుకొని అన్నం పప్పు మెత్తబడేంతవరకు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత పైనుంచి నెయ్యి వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి.
';
అన్నం బాగా మెత్తబడి ఉడికిన తర్వాత మరో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలిపి సర్వ్ చేసుకోండి. అంతే హై ప్రోటీన్ పెసరపప్పు అన్నం రెడీ అయినట్లే..